Site icon NTV Telugu

NTR-Neel : 2వేల మందితో ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్..

Ntrneel

Ntrneel

NTR-Neel : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుగుతోంది. మొన్నటి దాకా కర్ణాటకలో ఓ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. ప్రస్తుం రామోజీఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారంట. ప్రశాంత్ నీల్ మూవీ అంటేనే భారీ యాక్షన్ సీన్లు పక్కా ఉండాల్సిందే. పైగా హీరో ఎలివేషన్లు పక్కా. ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా ఇలాంటి ఎలివేషన్లే ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం ఆర్ ఎఫ్ సీలో వీటినే ప్లాన్ చేస్తున్నారంట.

Read Also : Deepika Padukone : కల్కి సీక్వెల్.. దీపిక అవే కండీషన్లు..!

దాదాపు 2వేల మందితో యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారంట ప్రశాంత్ నీల్. ఇందులో ఎన్టీఆర్ వీరోచితంగా పోరాడుతాడని అంటున్నారు. ఇప్పటి వరకు చేసిన అన్ని సీన్లకంటే ఇదే అతిపెద్ద యాక్షన్ సీక్వెన్స్ అని తెలుస్తోంది. ఇది సినిమాకే హైలెట్ అని అంటున్నారు మూవీ సన్నిహిత వర్గాలు. చాలా రోజులుగా మూవీ షూటింగ్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది.

వచ్చే ఏడాది జూన్ 25న మూవీని రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే ఫారెన్ షెడ్యూల్ కూడా ఉంటుందంట. అక్కడ కూడా యాక్షన్ సీన్లు ఉంటాయని అంటున్నారు. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టొవినో థామస్ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇందులో అతనిది విలన్ పాత్రనా కాదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

Read Also : HHVM : ‘వీరమల్లు’ పోస్టుపోన్.. ఒక రకంగా మంచిదే..

Exit mobile version