రాకింగ్ స్టార్ యష్ నటించిన “కేజీఎఫ్ చాప్టర్ 2” ప్రస్తుతం స్లో అయ్యే మూడ్‌లో లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శాండల్‌వుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. 10 రోజుల క్రితం విడుదలైన ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. సినిమాపై ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. “కేజీఎఫ్ చాప్టర్ 2″కు ఫిదా అయిన స్టార్స్ జాబితాలో రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఇటీవల “కేజీఎఫ్ చాప్టర్ 2″ను వీక్షించిన రామ్ చరణ్ సోషల్ మీడియాలో తన రివ్యూ ఇస్తూ చిత్రబృందంపై పొగడ్తల వర్షం కురిపించారు.
Read Also : Doctor Strange in the Multiverse of Madness : సౌదీలో బ్యాన్… ఎందుకంటే ?
చెర్రీ ట్వీట్ కు ప్రతిస్పందనగా ప్రశాంత్ నీల్ స్పందిస్తూ థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు ప్రశాంత్ నీల్ “ఆచార్య”లో తన అభిమాన నటుడు చిరంజీవితో పాటు చరణ్ ను చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “సలార్” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. మరోవైపు మెగా హీరోలు చరణ్, చిరు “ఆచార్య” ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 29న ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.
Thank you so much @AlwaysRamCharan garu🙏
Looking forward to seeing some magic in #Sivakortala garu's #Acharya with you and my favourite @KChiruTweets garu. All the best brother! https://t.co/YeZt0P6mvW— Prashanth Neel (@prashanth_neel) April 24, 2022