ఒక స్టార్ డైరెక్టర్ లేదా నటీనటులు తమకున్న మద్యపాన అలవాటును బహిరంగంగా బయట పెట్టే ధైర్యం చేయడం చాలా అరుదు. అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ అరుదైన వ్యక్తుల జాబితాలో చేరిపోయారు. తనకు మందు అలవాటు ఉందని, ఆ మత్తే తనకు బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్స్ రాయడానికి ప్లస్ అవుతుందని అన్నారు.
Read Also : Ravanasura : కీలక షెడ్యూల్ కంప్లీట్
ఇటీవల ఓ మీడియా పోర్టల్‌తో ఇంటరాక్షన్ సందర్భంగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ “నేను ఒక షరతుతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాను. దయచేసి మీరు నా ఇంటర్వ్యూలోని ఈ భాగాన్ని తొలగించబోమని నాకు ప్రామిస్ చేయండి” అని చమత్కరించారు. ఆ తరువాత “నేను మద్యం తాగుతాను. మందు తాగుతూనే కథలు కూడా రాస్తుంటాను. మత్తులో ఉన్నప్పుడే సినిమాలో ఒక సన్నివేశాం అవసరమా? లేదా? అనేది నిర్ధారిస్తుంటాను. ఇక్కడ కథ గురించి కాదు, దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నామనేది ముఖ్యమైన టాస్క్” అని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. మొత్తానికి ప్రశాంత్ నీల్ తనకు మందు అలవాటు ఉందన్న విషయాన్ని, దానివల్ల తనకు ఎలా ప్రయోజనం చేకూరుతుందన్న విషయాన్ని బహిరంగంగా వెల్లడించడం సాహసోపేతమే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “కేజీఎఫ్-2” ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత ప్రభాస్‌తో ‘సలార్’ సెట్స్ పై ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ తో ఓ మూవీ చేయనున్నారు.
