Prashanth Neel: KGF వల్లే సలార్ డిలే… షాకింగ్ సీక్రెట్స్ బయటపెట్టిన నీల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సలార్ గురించి ఎలాంటి అప్డేట్ బయటికొచ్చిన సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఇప్పటి వరకు సలార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నా ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు. అందుకే.. ఒక్కొక్కటిగా సలార్ నుంచి కొన్ని షాకింగ్ సీక్రెట్స్ బయటపెడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కథ ఇద్దరు స్నేహితుల గురించి అని హింట్ ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు సలార్ గురించి ఇంకొన్ని విషయాలను వెల్లడించాడు. సలార్ సినిమా చేయాలనే ఆలోచన 15 ఏళ్ల క్రితమే నా మదిలో మెదిలింది, కానీ నా ఫస్ట్ సినిమా ‘ఉగ్రమ్’ చేసిన తర్వాత KGFతో బిజీ అయ్యాను. ఈ సినిమా చేయడానికి దాదాపు 8 సంవత్సరాలు పట్టిందని చెప్పుకొచ్చాడు.
సలార్ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ… హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా మొత్తం షూట్ చేశాం. హైదరాబాద్ నుండి 5 గంటల ప్రయాణం దూరంలో ఉన్న సింగరేణి మైన్స్‌లో షూట్ చేశాం. అంతేకాదు.. సౌత్ పోర్ట్స్, మంగళూరు పోర్ట్, వైజాగ్ పోర్ట్‌లో కూడా షూటింగ్ చేసాము. ఇది కాకుండా యూరప్‌లో ఓ చిన్న భాగాన్నిచిత్రీకరించాం. మొత్తంగా దాదాపు 114 రోజుల పాటు సలార్ షూటింగ్ జరిగింది.. అని చెప్పుకొచ్చాడు. దీంతో సలార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం చాలా సమయం తీసుకున్నారనే చెప్పాలి. ఈ సినిమాలో కొన్ని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించాడు నీల్. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఖచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
- Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
- Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు... బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
- Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!