Prashanth Neel Leaks Salaar Movie Story Line: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ సిరీస్ డైరెక్ట్ చేసి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అనగానే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిజంగా ఉందో లేదో తెలియదు కానీ కేజీఎఫ్ సిరీస్ కి సలార్ సినిమాకి లింక్ ఉందని ప్రచారం కూడా మొదలవడంతో ఆ అంచనాలు ఎప్పటికప్పుడు పెరుగుతూ వెళ్లాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూ ఈనెల 22వ తేదీన రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా కే జిఎఫ్ సిరీస్ తో లింక్ అయి ఉంటుందా? ఒకవేళ ఉంటే కేజిఎఫ్ ముందు జరిగిన కథ లేక తర్వాత జరిగిన కథనా? అనే విషయాల మీద రకరకాల చర్చలు జరుగుతున్న క్రమంలో ఈ సినిమా కథ ఏమిటి అనే విషయం మీద దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు.
Martin Luther King : అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీ లోకి వచ్చేసిన మార్టిన్ లూథర్ కింగ్..
ఈ సినిమా కథ ప్రాణ స్నేహితులైన ఇద్దరు బద్ధ శత్రువులుగా ఎలా మారారు? అనే అంశాన్ని బేస్ చేసుకుని ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి ఫ్రెండ్షిప్ అనేది ఒక కోర్ ఎమోషన్ గా ఉంటుందని ఆయన వెల్లడించారు. సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ లో మొదటి భాగం కథ చెబుతామని ఆ తర్వాత పూర్తి కథ రెండో సినిమాలో పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఈ సలార్ సినిమా గురించి జరిగిన ఎన్నో ప్రచారాలకు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చినట్టు అయింది. సో ఈ మాటలను బట్టి చూస్తే ఈ సినిమాకి కేజేఎఫ్ సిరీస్ కి లింక్ అయితే లేదనే చెప్పాలి. అయితే దర్శకుడు తన ఇంటెలిజెన్స్ తో ఏదో ఒక లింక్ క్రియేట్ చేసినా చేయచ్చు.