NTV Telugu Site icon

Salaar: ఎంత పని చేశారయ్యా.. ఇప్పుడు అప్డేట్స్ తెలిసేది ఎలా..?

Salar

Salar

Salaar: ఒక స్టార్ హీరో , ఒక స్టార్ డైరెక్టర్, ఒక స్టార్ నిర్మాణ సంస్థ కాంబో లో ఒక సినిమా వస్తుంది అంటే అభిమానులకు పండుగే అని చెప్పాలి. ఆ సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకు అభిమానుల ప్రశ్నలకు మేకర్స్ సమాధానం చెప్తూ ఉండాలి. అప్డేట్స్ రాకపోయినా, పోస్టర్ బాగోలేకపోయినా.. సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పవు. సోషల్ మీడియాలో ఆన్సర్ ఇవ్వకపోతే డైరెక్ట్ గా మెసేజ్ లు చేసి విసిగిస్తూ ఉంటారు. ఇక అలాంటి పరిస్థితినే ఎదుర్కుంటున్నారు సలార్ మేకర్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 28 న రిలీజ్ కానుంది. ఇప్పటికే సలార్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

SarathBabu: శరత్ బాబు చివరి చిత్రం ఏంటో తెలుసా.. ?

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. డార్లింగ్ ఫ్యాన్స్ దెబ్బకు సలార్ మేకర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. నిత్యం ప్రభాస్ ఫ్యాన్స్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు, నిర్మాత విజయ్ కిరగందూర్ కు మెసేజ్ లు చేసి విసిగిస్తున్నారట. అప్డేట్స్ ఇవ్వాలంటూ వేధిస్తున్నారట. దీంతో చేసేదేం లేక, ఆ వేధింపులు తట్టుకోలేక ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్ ట్విట్టర్ అకౌంట్ ను పూర్తిగా డిలీట్ చేసేశారట. వారి యొక్క ఒత్తిడికి దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ట్విట్టర్ కి దూరంగా ఉంటున్నారని.. ఏకంగా తమ అకౌంట్స్ ని ప్రస్తుతానికి డియాక్టివేట్ చేయడం జరిగిందని చెప్పుకొస్తున్నారు. సలార్ సినిమా పూర్తి అయ్యేవరకు వారు ట్విట్టర్ వైపు కూడా చూడరట. ఇక ఈ విషయం తెలియడంతో డార్లింగ్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంత పని చేశారయ్యా.. ఇప్పుడు అప్డేట్స్ తెలిసేది ఎలా..? అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ను మిగతా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Show comments