Prasanth Varma Gives Hanuman OTT Update: సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది కానీ ఆ ప్రచారం జరిగిన సమయానికి మాత్రం రిలీజ్ కాలేదు. ఇక హిందీలో ఏకంగా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉండగా టెలికాస్ట్ కి కొద్ది సమయం ముందు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా వేదిక స్పందించారు. హనుమాన్ ఓటీటీలోకి వచ్చే డేట్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
Shivam Bhaje: ‘శివం భజే’ అంటూ వచ్చేస్తున్న ఓంకార్ తమ్ముడు
ఇక హనుమాన్ సినిమాలో తేజ సజ్జ, అమృత అయ్యర్లు హీరో హీరోయిన్లుగా నటించగా సంక్రాంతి సందర్భంగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందు వచ్చింది ఈ సినిమా. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 92 ఏళ్ల తెలుగు సినీ చరిత్ర రికార్డులను బద్దలు కొట్టి సంక్రాంతికి సరికొత్త రికార్డులు సెట్ చేసింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని సినిమా చూసిన వారు, చూడని వారు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకి సీక్వెల్ గా అనౌన్స్ చేసిన జై హనుమాన్ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.
#HanuMan OTT streaming date announcement is coming! 😊👍🏼
— Prasanth Varma (@PrasanthVarma) March 11, 2024