Shivam Bhaje: ‘శివం భజే’ అంటూ వచ్చేస్తున్న ఓంకార్ తమ్ముడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Ashwin Babu’s new-age film titled ‘Shivam Bhaje’: యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఒక సినిమా తెరకెక్కుతోంది. గాంధర్వ ఫేమ్ అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోకి మొన్నీమధ్యనే బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ అడుగు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి ‘జై చిరంజీవ’ చిత్రం తో టాలీవుడ్ కి పరిచయమయిన ఈ పాపులర్ బాలీవుడ్ నటుడు ఇటీవల మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘బిగ్ బ్రదర్’ సినిమాలో కూడా నటించారు. ఈ చిత్రానికి ఒక ఆధ్యాత్మికమైన టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. ‘శివం భజే’ అనేది సినిమా పేరుగా అనౌన్స్ చేశారు. ఇక ఈరోజు విడుదలైన అద్భుతమైన టైటిల్ పోస్టర్‌లో శివుని గంభీరమైన చిత్రాన్ని చూపారు. హీరో ఎత్తైన పర్వతాల నేపథ్యంలో శివుని యొక్క భారీ రూపం ముందు నిలబడి చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ”అశ్విన్ హీరోగా ఒక వైవిధ్యమైన కథతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంగా ‘శివం భజే’ తెరకెక్కుతుంది.
Oppenheimer OTT: ఏడు అవార్డులతో సత్తా చాటిన సినిమా వచ్చేది ఈ ఓటీటీలోనే.. గెట్ రెడీ
Also Read
కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. కామెడీ, డ్రామా, యాక్షన్ థ్రిల్స్ తో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, తమిళ విలన్ సాయి ధీనా, హైపర్ ఆది ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకుని భారీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాం. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని అన్నారు. దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ, ” మా కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ ‘శివం భజే’ దొరకడం చాలా సంతోషంగా ఉంది. 80% షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ వైపు అడుగులు వేస్తున్నాం. మా హీరో అశ్విన్ బాబు, బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, తమిళ నటుడు సాయి ధీనా, హైపర్ ఆది, మా నిర్మాత మహేశ్వర రెడ్డి చాలా సహకరించారు. సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం” అన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!