Site icon NTV Telugu

Pawan Kalyan : ఛీ..ఛీ.. అంటూ పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. జనసేన కౌంటర్..

Pawan

Pawan

Pawan Kalyan : పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాశ్ రాజ్ వార్ మరోసారి తెరమీదకు వచ్చింది. అది కూడా హిందీ భాష మీదనే. గతంలోనూ హిందీ భాష విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయి. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవంలో పవన్ కల్యాణ్‌ పాల్గొని హిందీ భాషపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మాతృభాష అమ్మలాంటిది అయితే హిందీ భాష పెద్దమ్మ లాంటిది అన్నారు. హిందీ నేర్చుకుంటే మనల్ని తక్కువ చేసుకున్నట్టు కాదని.. మరింత బలపడ్డట్టు అవుతుందన్నారు. పవన్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ‘ఈ రేంజ్ కు అమ్ముకోవడమా.. ఛీ..ఛీ’ అంటూ రాసుకొచ్చారు. ఇంకేముంది ఆ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోయింది.

Read Also : Ronith Roy : తిండిలేక ఇబ్బందులు పడ్డా.. ప్రముఖ నటుడు కామెంట్స్

జనసేన పార్టీ ప్రకాష్‌ రాజ్ కు కౌంటర్ ఇచ్చింది. అసలు అమ్ముకోవడం అంటే ఇదే అంటూ ప్రకాశ్ రాజ్ కు సంబంధించిన ఓ పాత వీడియోతో కౌంటర్ ఇచ్చింది. మాతృభాషను కాపాడుకుంటూ, ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం అమ్ముకున్నట్టు కాదని.. అసలు ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పు అంటే నువ్వు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చెయ్యగలవా? ఈరోజు ఇలా అమ్ముడుపోయి మాట్లాడగలవా అంటూ ట్వీట్ చేసింది. అటు జనసైనికులు లక్షల్లో ట్వీట్లు చేస్తూ ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్‌ హిందీ నేర్చుకోమన్నారు అంటే అది మనకు ఉపయోగపడుతుందనే తప్ప.. అమ్ముడు పోయినట్టు కాదని కామెంట్లు పెడుతున్నారు.

Read Also : Nimisha priya Case: కేరళ నర్సు నిమిష ప్రియ కేసేంటి.? ఏం జరిగింది..?

Exit mobile version