ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై వేసిన సెటైర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ప్రకాష్ రాజ్ తాజాగా మరో సెటైర్ పేల్చారు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రకాంత్ పాటిల్ ప్రధాని మోదీ రెండు గంటలే నిద్రపోతారని, ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పని చేస్తుంటారనీ చెప్పడంపై విమర్శలు గుప్పించారు ప్రకాష్ రాజ్. కామన్సెన్స్ ఉపయోగించండి… అదొక జబ్బు అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read Also : Bheemla Nayak : అనుకున్న దానికంటే ముందే ఓటిటిలో !
“దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి… నిద్రపోలేకపోవడం అనేది ఓ జబ్బు… వైద్య పరిభాషలో దీన్ని ఇన్సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు… ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి” అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇక ఎప్పటిలాగే ఈ ట్వీట్ కు కూడా #జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. ఇక ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ భాషల్లోని పలు చిత్రాల్లో నటిస్తున్నారు.
