బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎటాక్’. లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘ఎటాక్’ మూవీ ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానుంది. హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ యాక్షన్-థ్రిల్లర్ లో జాన్ సూపర్ సోల్జర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో జాన్ అబ్రహం మాట్లాడుతూ తాను హిందీ నటుడిని అని, తెలుగు సినిమాల్లో చేయనని తేల్చి చెప్పేసి సంచలనం సృష్టించాడు. ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుండగా, ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ “ఎటాక్” సినిమాపై సోషల్ మీడియా వేదికగా తన రివ్యూ ఇచ్చారు. నిన్న రాత్రి సినిమాను చూసిన ఆయన సినిమా అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ అంటూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.
Read Also : KGF Chapter 2 : సెన్సార్ పూర్తి… రన్ టైమ్ ఎంతంటే ?
“#Attack Movie… నిన్న రాత్రి చూశాను. అద్భుతమైన యాక్షన్ ఎంటర్‌టైనర్. హే సూపర్ సోల్జర్ జాన్ అబ్రహం మీరు అదరగొట్టారు. లక్ష్యరాజ్ ఆనంద్ మీరు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అజయ్ కపూర్, జయంతిలాల్ గడాతో పాటు టీమ్ మొత్తానికి అభినందనలు” అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో హీరో బాస్ పాత్రలో జాన్ నటించారు.
