విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జిమ్‌లో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఈరోజు మార్నింగ్ జిమ్‌లో బాస్‌ని కలిశాను. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం సంతోషంగా ఉంది. మీరెప్పుడూ మాకు స్పూర్తి అన్నయ్య’ అని రాసుకొచ్చారు. కాగా, ఆయన చేతి గాయాన్ని చిరు అడిగి తెలుసుకున్నారు. ప్రకాష్ రాజ్ ఇటీవలే షూటింగ్ లో ప్రమాదానికి గురికావడంతో చిన్న సర్జరీ అయిన విషయం తెలిసిందే.
ఇక, ‘మా’ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పోటీ చేయనున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు పూర్తి మద్దతు తెలిపారు. ప్రకాష్ రాజ్ పై వస్తున్న విమర్శలకు సైతం నాగబాబు కౌంటర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం చిరు-ప్రకాష్ భేటీతో ‘మా’రింత ఆసక్తికరంగా మారింది.
‘మా’ ఆసక్తి.. చిరును మీట్ అయిన ప్రకాష్ రాజ్
