Site icon NTV Telugu

“మా” సభ్యులకు ప్రకాష్ రాజ్ స్పెషల్ విందు

Prakash Raj Press Meet on MAA Association Election

గత కొంత కాలం నుంచి టాలీవుడ్ లో ఇండస్ట్రీలో “మా” ఎన్నికల వివాదం విషయమై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే “మా” అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించారు. అయితే ఆయన ప్యానల్ లో అంతకు ముందు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మరో ఇద్దరు మహిళలు జీవిత రాజశేఖర్, హేమ కూడా ఉండడం అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బండ్ల గణేష్ బయటకు రావడం, స్వతంత్రంగా పోటీ చేస్తానని చెప్పడం, జీవిత రాజశేఖర్ పై ఆయన కామెంట్ చేయడం మరో వివాదానికి తెర తీసింది. జీవిత రాజశేఖర్ కూడా బండ్ల గణేష్ కామెంట్స్ కు గట్టిగానే సమాధానం చెప్పింది.

Read Also : సాయి ధరమ్ తేజ్ బైక్ సెకండ్ హ్యాండ్ ?

ఇదిలా ఉండగా తాజాగా ప్రకాష్ రాజ్ “మా” సభ్యుల కోసం స్పెషల్ గా ఒక విందు ఏర్పాటు చేశాడు. మన సిని”మా” బిడ్డలు అంతా కలిసి ఇంటరాక్ట్ అవుదామని, మన విజన్ ఏంటో షేర్ చేసుకుని, అన్ని విషయాలూ చర్చించుకుందాం అని ప్రకాష్ రాజ్ తన ఆహ్వానంలో తెలిపాడు. అంతే కాదు సభ్యుల కోసం ఈ రోజు ప్రత్యేకంగా లంచ్ కూడా ఏర్పాటు చేశాడు. సెప్టెంబర్ 12 ఆదివారం రోజున జెఆర్సి కన్వెన్షన్ సెంటర్ లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ మీటింగ్ ఉంటుందని ఆహ్వాన పత్రిక ద్వారా ప్రకాష్ రాజ్ తెలిపాడు. దీంతో ఈ మీటింగ్ లో అసలు ఏం చర్చ జరుగుతుందోనని ఆసక్తి నెలకొంది.

Exit mobile version