సాయి ధరమ్ తేజ్ బైక్ సెకండ్ హ్యాండ్ ?

సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు అపోలో ఆసుపత్రి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా తేజ్ బైక్‌ ప్రమాదంపై మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాయి ధరమ్‌ తేజ్‌ సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ను కొనుగోలు చేశారని ఆయన అన్నారు. ఎల్బీ నగర్‌కు చెందిన అనిల్‌ కుమార్‌ అనే వ్యక్తి నుంచి తేజ్ ఈ బైక్‌ ను కొన్నాడట. ఈ సమాచారం మేరకు అనిల్‌కుమార్‌ను పిలిచి విచారిస్తున్నామని మాదాపూర్‌ డీసీపీ తెలిపారు.

Read Also : అక్కినేని అమల అరుదైన వ్యక్తిత్వం!

బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ఇంకా పూర్తి కాలేదని, బైక్‌ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపామని, గతంలో మాదాపూర్‌లోని పర్వతాపూర్‌ వద్ద ఓవర్‌ స్పీడ్‌పై రూ.1,135 చలాన్‌ వేశామని, ఈ చలాన్‌ను ఈ రోజు సాయి ధరమ్‌ తేజ్‌ కుటుంబ సభ్యులు క్లియర్‌ చేశారని వెల్లడించారు. రోడ్డు ప్రమాదం సమయంలో 78 కి.మీ. స్పీడ్‌తో వెళ్తున్నాడని, దుర్గం చెరువుపై 102 కి.మీ. వేగంతో బైక్‌ నడుతుపున్నారని పోలీసులు నిర్ధారించారు. రాష్‌ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా బైక్‌ను నడిపాడని, ఆటోను లెఫ్ట్‌ సైడ్‌ నుంచి ఓవర్‌ టేక్ చేయబోయి స్కిడ్‌ అయ్యి కింద పడ్డాడు అంటూ స్పష్టం చేశారు డీసీపీ. తేజ్‌ వద్ద టూ వీలర్‌ నడిపే డ్రైవింగ్‌ లైసెన్స్‌ లభ్యం కాలేదని, లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ చేసే లైసెన్స్‌ మాత్రమే ఉందని, ప్రమాదం సమయంలో హెల్మెట్‌ ధరించి ఉన్నాడని ఆయన పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-