NTV Telugu Site icon

Pragathi : నా మీద గాసిప్స్ వేస్తున్నారా.. ఆటిట్యూడ్ చూపిస్తున్న ప్రగతి

Pragathi

Pragathi

Pragathi: టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో తల్లిగా, అత్తగా ఆ నటిస్తూ మెప్పిస్తోంది. ఇక సినిమాల్లో ఎంతో సాఫ్ట్ గా పద్దతిగా కనిపించే ఆమె రియల్ లైఫ్ అందుకు భిన్నం. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో రచ్చ చేసే ప్రగతికి ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక జిమ్ వర్కవుట్స్ తో కుర్రకారును సైతం మెప్పిస్తున్న ప్రగతి తాజాగా ఒక ఆటిట్యూడ్ వీడియోను షేర్ చేసింది. నా జీవితాన్ని చూసి దానిపై గాసిప్స్ చెప్పుకుంటున్నారా.. వదలకండి.. అలాంటివి మరిన్ని సీజన్ 2 లో చూపిస్తాను అంటూ ఆటిట్యూడ్ రీల్ చేసింది.

ఇక ఆ తరువాత గాసిప్స్ గురుంచి చెప్తే అది అందమైన డ్రెస్ వేసినట్లు ఉండాలి.. కానీ చెత్త డ్రెస్ లు వేసుకున్నట్లు చెత్త చెప్పకూడదు అని అర్ధం వచ్చేలా ఉన్న రీల్స్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ రీల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అసలు ప్రగతి గురించి వస్తున్న గాసిప్స్ ఏంటి..? అంటే ఆమె ఈ వయస్సులో కూడా చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకొని స్కిన్ షో చేస్తుందని, ఆంటీ అందాల ఆరబోతను తగ్గించుకోమని, అవకాశాల కోసమే ప్రగతి స్కిన్ షో చేస్తోందని ఇలా వార్తలు పుట్టుకొస్తున్నాయి. వీటికి ప్రగతి ఇలా సమాధానం ఇచ్చింది అని చెప్పుకొస్తున్నారు. ఇక మరికొందరు నీ గురించి ఎవరు గాసిప్స్ వేయడం లేదు.. ఇలాంటివి మానేస్తే బెటర్ అని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఇవేమి పట్టించుకోని ప్రగతి ఉన్నది ఒకటే జిందగీ. అనుభవించాలి అన్నట్లు తనకిష్టమైన పనులను చేస్తూ ముందుకు సాగిపోతోంది.