టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరికొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ నిర్మించిన మూవీ ‘తిమ్మరాజుపల్లి టీవీ’. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. థియేటర్లలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు మే 15 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో ‘రాజప్ప’ అనే కీలక పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు ప్రదీప్ కొట్టె, తాజాగా మీడియాతో ముచ్చటించి తన సీక్రెట్ సినీ జర్నీకి సంబంధించిన పలు సంచలన, భావోద్వేగ విషయాలను పంచుకున్నారు.
“చిత్తూరు జిల్లా పళమనేరు మా సొంతూరు. నేను సినిమాల్లో, యాక్టింగ్ ఫీల్డ్‌లో ఉన్నానని మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. కేవలం మా అక్కకు మాత్రమే తెలుసు. ఓరోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు మా అమ్మనాన్నలను సర్ ప్రైజ్ చేస్తూ స్పాట్‌కు తీసుకువచ్చింది మా అక్క. నేను మేకప్‌లో యాక్ట్ చేస్తుండగా నా పేరెంట్స్ నన్ను అలా చూడటం, వాళ్లను నేను అక్కడ చూడటం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్.” “చెన్నైలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాను. వర్క్ ఫ్రమ్ హోమ్, లీవ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ జాబ్‌ను, సినిమాను బ్యాలెన్స్ చేశాను. ఇలా గత పదేళ్ల నుంచి రెండింటినీ మేనేజ్ చేస్తున్నాను. నా ఫ్యామిలీ, ముఖ్యంగా నా భార్య ఇచ్చిన సపోర్ట్ వల్లే నా కెరీర్‌పై ఫోకస్ చేయగలిగాను. ఆమె కుటుంబ బాధ్యతలు చూసుకోవడం వల్లే ఇదంతా సాధ్యమైంది. బీ స్టూడియోలో బషీర్ మాస్టర్ దగ్గర నాటకాలు వేశాను. ఆ నాటకాలు చూసే డైరెక్టర్ మునిరాజు గారు నన్ను ‘రాజప్ప’ పాత్రకు సెలెక్ట్ చేశారు.” “ప్రస్తుతం కొన్ని మంచి కథలు వింటున్నాను. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏదో ఒకటి చేయాలనిపించడం లేదు. నా కెరీర్‌కు మైలేజ్ ఇచ్చే, ఇంపార్టెన్స్ ఉన్న బలమైన పాత్రల కోసమే వెయిట్ చేస్తున్నాను.” అని చెప్పుకొచ్చారు.
