మరో స్టార్ డాటర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటీకే చిరంజీవి కుమార్తె సుష్మిత, అశ్విని దత్ కుమార్తె ప్రియాంక, గుణశేఖర్ కుమార్తెలు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరంతా హీరోయిన్లుగానో నటీమణులు గానో కాకుండా నిర్మాతలుగా మారి, OTT ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు కూతురు, ప్రభాస్ సోదరి కూడా ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈమె కూడా నిర్మాతగానే అడుగు పెట్టబోతోంది. ప్రసీద ఉప్పలపాటి ఓటీటీ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సిద్ధమైందని వినికిడి.
Read Also : Radheshyam : హిలేరియస్ మీమ్ షేర్ చేసిన తమన్
ఇక మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం “రాధే శ్యామ్” మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ‘రాధే శ్యామ్’ విడుదలైంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ షురూ అవుతుందని అన్నారు. ఆ OTT ఫిల్మ్ ఏంటి ? దాని డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కబోతోంది ? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రసీద నిర్మాతగా సక్సెస్ కావాలని కోరుకుందాం.
