Site icon NTV Telugu

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. టీజర్ లోడింగ్

salaar

salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే రాధేశ్యామ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమ కోసం ఎదురుచూశారు. కరోనా వలన వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా గతనెల రరిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుని ప్రేక్షకులను నిరాశపర్చింది. ఇక దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చూపంతా నెక్స్ట్ సినిమా సలార్ పైనే ఉంది. కెజిఎఫ్ తో భారీ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఇటీవల ప్రశాంత్ నీల్.. సలార్ లో ప్రభాస్ లుక్ అదిరిపోతోందని, మునుపెన్నడు చూడని ప్రభాస్ ను సలార్ లో చూస్తారని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ లో అంచనాలను పెంచేశాడు. దీంతో ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ టీజర్ గురించిన ఒక వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. సలార్ టీజర్ ను మే నెల చివర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆ సమయం వస్తుందా..? అని రోజులు లెక్కేస్తున్నారు. మరి ఈసారి ప్రభాస్ ఈ సినిమాతో హిట్ ని అందుకుంటాడా..? లేదా అనేది చూడాలి.

Exit mobile version