యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎట్టకేలకు తొలి బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్” షూటింగ్‌ను ముగించాడు. ముంబైలోని సెట్‌లో కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ ఈ వేడుకను జరుపుకుంది. ప్రభాస్ తన పార్ట్‌ను పూర్తి చేయడంతో బ్యాలెన్స్ టాకీ పార్ట్‌లను నవంబర్‌లో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే చిత్ర కథానాయిక కృతి సనన్ ఒక వారం క్రితం తన భాగం షూటింగ్ ముగించింది. సైఫ్ అలీ ఖాన్ కూడా చిత్రీకరణను పూర్తి చేశారు. వచ్చే ఏడాది వేసవి వరకు వీఎఫ్‌ఎక్స్ పనుల్లో యూనిట్ బిజీగా ఉంటుంది. ఇదిలా ఉండగా, ఈ చిత్రం టీజర్, ఇతర ప్రచార కంటెంట్‌కు సంబంధించిన అప్‌డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also : దీపావళి పండగ స్పెషల్.. చెర్రీ అండ్ బన్నీ ఫ్యామిలీ ఫోటో
టాప్ బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో రావణాసురుడిగా నటిస్తుండగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా రాముడి పాత్రను పోషిస్తున్న ప్రభాస్ కు తమ్ముడిగా కనిపించనున్నారు. సినిమాలో కృతి సనన్ సీతా దేవిగా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 11, 2022న బిగ్ స్క్రీన్స్ పైకి రానుంది.
