NTV Telugu Site icon

Prabhas: మొదటి సారిగా అలాంటి పాత్రలో నటించబోతున్న ప్రభాస్ .. వర్కౌట్ అవుతుందా?

Untitled Design (13)

Untitled Design (13)

పాన్ ఇండియ‌ స్టార్ ప్రభాస్ తన వ‌రుస‌ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా కూడా ఒకటి. అయితే ప్రభాస్‌ కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఈ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సమాచారం ప్రకారం.. కొంత కోలుకున్న ప్రభాస్ రీసెంట్ గా తన ‘రాజా సాబ్‌’ మూవీ పెండింగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేసి, హను రాఘవపూడి ‘ఫౌజి’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడట.

ఇక భారత స్వాతంత్రానికి ముందు జరిగిన యదార్థ ప్రేమ కథ గా చెప్పబడుతున్న ఈ సినిమా లో, ప్రభాస్ ఒక భారతీయ సైనికుడిగా కనిపించబోతున్నట్లుగా వార్తలు వినిపించగా, ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన మరో ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఏంటి అంటే. ఈ మూవీలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన, బ్రాహ్మణ అబ్బాయి గా డార్లింగ్ కనిపించబోతున్నాడట.

త్వరలో కొత్త షెడ్యూల్ తమిళనాడులోని మదురై సమీపంలో మొదలు పెట్టి. అక్కడ దాదాపు 20 డేస్ పాటు దేవీపురం అగ్రహారం నేపథ్యంలో బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన సీన్స్‌ను షూట్ చేయబోతున్నారట. ఈ మంత్ లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.