Site icon NTV Telugu

Disha Patani: ప్రభాస్ నన్ను చెడగొడుతున్నాడు..

Prabhas

Prabhas

టాలీవుడ్ లో భోజన ప్రియుడు ఎవరు అనగానే టక్కున డార్లింగ్ ప్రభాస్ పేరును చెప్పేస్తారు ప్రతి ఒక్కరు..  అతిధి మర్యాదలతో హీరోయిన్లను చంపేయడం ఎలాగో ప్రభాస్ కి మాత్రమే తెలుసు. ఆయన ఇంటికి వెళ్లిన వారు పొట్ట చేతి మీద పెట్టుకొని బాబోయ్ అంటూ బయటికి రాక మానరు. ఇక సెట్ లో ఎవరు కొత్త వారు వచ్చినా ప్రభాస్ ఇంటి నుంచి క్యారేజ్ రావాల్సిందే.. వారు ఉప్పలపాటి వారి ఇంటి రుచి టేస్ట్ చేయాల్సిందే. ఇప్పటికే దీపికా పదుకొనె, శ్రధ్దా కపూర్ లాంటి హీరోయిన్లు ప్రభాస్ ఆతిధ్యానికి ఫిదా అయినవారే.. తాజాగా ఈ లిస్టులోకి చేరిపోయింది  మరో హాట్ బ్యూటీ దిశా పటానీ.

ప్రభాస్, దీపికా జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా, దిశా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ కి మన బాహుబలి ఇదుగో ఈ రేంజ్ ఆతిధ్యాన్ని అందించాడు. ఈ విషయాన్ని దిశా తన సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ.. “థాంక్యూ ప్రభాస్.. మమ్మల్ని చెడకొట్టినందుకు” అంటూ చెప్పుకొచ్చింది. నిత్యం డైట్ పేరుతో ఏవేవో తినే హీరోయిన్లకు అచ్చ తెలుగు వంటకాలు రుచి చూపిస్తే తినకుండా ఉంటారా..? అని కొందరు.. ఇక రండమ్మా  బాలీవుడ్ హీరోయిన్లందరూ ప్రభాస్ ఇంటిముందు క్యూ కట్టాలమ్మా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version