Site icon NTV Telugu

Prabhas: డైనోసర్ దిగుతోంది.. ఇక పక్కకి తప్పుకోండి!

Prabhas

Prabhas

Prabhas to return to India from Europe on November 6: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా ఆది పురుష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మాదిరి ఫలితాన్ని అందుకున్న ప్రభాస్ మోకాలు నొప్పి ఆపరేషన్ చేయించుకోవడం కోసం విదేశాలకు వెళ్ళాడు. పుట్టినరోజు వేడుకలు కూడా కలిసి రావడంతో ఇండియా రాకుండానే అక్కడ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఇక ఆయన హీరోగా నటించిన సలార్ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఆ సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఈ సినిమాని డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టాలని భావిస్తోంది సినిమా యూనిట్. అందులో భాగంగానే నవంబర్ రెండో వారంలో టీజర్ రిలీజ్ ఈవెంట్ చేయాలని భావిస్తున్నారు.

Ghost Telugu: ‘ఘోస్ట్’ ఆగమననానికి డేట్ ఫిక్స్.. ఆరోజునే రిలీజ్!

పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే విధంగా ఈ టీజర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమాలో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ కూడా పాల్గొనాల్సిన నేపథ్యంలో ఆయన నవంబర్ ఆరవ తేదీన ఇండియా తిరిగి వచ్చేందుకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇండియా తిరిగి వచ్చి కొంత రెస్ట్ తీసుకున్న తర్వాత పూర్తిగా సలార్ ప్రమోషన్స్ మీద ఫోకస్ చేయబోతున్నారు. ఇప్పటివరకు బాహుబలి తర్వాత ఏ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో పూర్తిస్థాయిలో విజయవంతం అయిందనిపించుకోలేదు. సలార్ సినిమాతో మరోసారి కం బ్యాక్ ఇచ్చేందుకు ప్రభాస్ చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండగా హోంబలే ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Exit mobile version