Site icon NTV Telugu

Prabhas: అవి అయిపోగానే ప్రభాస్‌కి సర్జరీ… మళ్లీ ఏమైంది?

Prabhas

Prabhas

ప్రభాస్ గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తునే ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్‌కు సర్జరీ అనే న్యూస్ వైరల్ అవుతోంది. బాహుబలి తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు ప్రభాస్. వాటిలో ఇప్పటికే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ రిలీజ్ అయిపోయాయి. నెక్స్ట్ సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. సమ్మర్‌లో కల్కి రిలీజ్ కానుంది. ఆ తర్వాత మారుతి సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈలోపే స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్ కానీ దీనికంటే ముందే ప్రభాస్ సర్జరీ చేయించుకోబోతున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడనే మాట వినిపిస్తునే ఉంది. సలార్‌ సినిమా షూటింగ్‌లో జరిగిన చిన్న యాక్సిడెంట్ వల్ల ప్రభాస్‌ కాలికి గాయమైందని అప్పట్లో టాక్ రాగా.. ఇప్పుడు పూర్తి స్థాయిలో మోకాలి సర్జరీకి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కల్కి, మారుతి సినిమాతో పాటు… సలార్ పనులు పూర్తి కాగానే సర్జరీ కోసం విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడట డార్లింగ్. ఆ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని… స్పిరిట్ సినిమాను మొదలు పెట్టే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. అసలు ఇందులో నిజముందా, లేదా అనే విషయంలో క్లారిటీ లేదు గానీ… ప్రభాస్ హెల్త్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా సరే… వీలైనంత త్వరగా డార్లింగ్ కోలుకోవాలని అంటున్నారు. ఇదిలా ఉంటే… ఆగష్టు 15న సలార్ ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నెలాఖరులో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ.

Exit mobile version