ఈ జనరేషన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ సోషల్ మీడియాని రూల్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్టీ సీజ్ ఫైర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. ప్రభాస్ ని సంబంధించిన న్యూస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా AI టెక్నాలజీతో ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న ఎడిట్స్ చూస్తుంటే మెంటల్ ఎక్కి పోవడం గ్యారెంటీ. ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న ఎడిట్స్ లో ఒక్క లుక్ లో ప్రభాస్ కనిపించినా చాలు ఆ సినిమా ఇండియాని షేక్ చేయడం గ్యారెంటీ. లేటెస్ట్ గా AIని వాడుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ని ఏకంగా “శివుడి”గా మార్చేశారు.
ఆదిపురుష్ సినిమాలో శ్రీరామునిగా నటించిన ప్రభాస్ ఇప్పుడు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో “మహాదేవుడి” పాత్రలో నటిస్తున్నాడు. ఈ వార్తని ఇటీవలే స్వయంగా మంచు విష్ణు కన్ఫర్మేషన్ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్… ప్రభాస్ ని శువుడిగా ఊహించుకుంటున్నారు. దాని రిజల్ట్ యే AI టెక్నాలజీ నుంచి వస్తున్న ఈ కొత్త ఫోటోస్. మంచి హైట్, పర్ఫెక్ట్ పర్సనాలిటీ మైంటైన్ చేసే ప్రభాస్ AI ఫోటోస్ పూనకాలు తెప్పించే రేంజులో ఉన్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోస్ లో కనిపిస్తున్న లుక్ లో ప్రభాస్ కనిపిస్తే చాలు… కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యే సమయానికి థియేటర్స్ అన్నీ టెంపుల్స్ అయిపోతాయి. మరి అసలు AIని పక్కన పెడితే మంచు విష్ణు అండ్ టీమ్ ప్రభాస్ ని శివుడిగా ఎలా చూపించబోతున్నారు అనేది చూడాలి.