Site icon NTV Telugu

The Raja Saab : ‘రాజాసాబ్’ కొత్త పోస్టర్ హల్‌చల్!

Prabas Rajasab

Prabas Rajasab

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ “ది రాజాసాబ్” పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటులు వెన్నెల కిషోర్‌, సత్య, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు ఎస్‌. థమన్. ఆయన ఇచ్చిన ట్యూన్స్‌ ఇప్పటికే యూనిట్‌లో సూపర్‌ హిట్‌ అయ్యాయని సమాచారం. ఈ మూవీని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ.జీ. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక తాజాగా, ప్రభాస్‌ సినీ కెరీర్‌ ప్రారంభమై 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా, సినిమా యూనిట్‌ నుంచి ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ వచ్చింది. దర్శకుడు మారుతి సోషల్‌ మీడియాలో కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో ప్రభాస్‌ కూల్‌ లుక్‌లో, సిగరెట్‌ పట్టుకుని స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా మారుతి ఎమోషనల్‌గా మాట్లాడుతూ –“23 ఏళ్ల క్రితం ప్రభాస్‌ సినీ ప్రయాణం ప్రారంభమైంది. అదే రోజున మేము ‘ది రాజాసాబ్’ షూట్‌ను పూర్తి చేశాం. ఇది నాకు చాలా స్పెషల్‌ మూమెంట్‌. ప్రభాస్‌ ఎనర్జీ, ప్యాషన్‌ చూసి ఆశ్చర్యపోయాను. ఈ సినిమా పూర్తిగా కొత్త వైబ్‌తో, కొత్త ఎనర్జీతో ప్రేక్షకులను ఎంటర్టైన్‌ చేయబోతోంది,” అని చెప్పారు. మొత్తం మీద, కామెడీ, హారర్‌, ఎమోషన్‌, రొమాన్స్‌ అన్నీ మిక్స్‌ అయిన ఈ ఎంటర్‌టైనర్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కాగా, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈ పోస్టర్‌ చూసి –“ఇదే మన సర్‌కి తగిన ఎనర్జీ!”, “ఇంకో బ్లాక్‌బస్టర్‌ రాబోతుంది!” అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version