పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న “రాధే శ్యామ్” ట్రైలర్ బుధవారం విడుదలైంది. దీంతో మరోసారి చిత్రబృందం ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. చిత్ర బృందంతో కలిసి ముంబైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తాజా మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ తాను బాలీవుడ్ సూపర్ స్టార్స్ ను చూసి స్ఫూర్తి పొందానని వెల్లడించాడు. “రాధే శ్యామ్”కు బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ప్రేరణ అని నటుడు చెప్పాడు.
Read Also : Radhe Shyam Trailer : డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్… తప్పు ఎక్కడ జరిగిందంటే ?
“ఇది రాజమౌళి లేదా బాహుబలితో మొదలై ఉండవచ్చు… కానీ మనం భారతీయ చిత్రాలను నిర్మించే సమయం వచ్చింది. బాహుబలి, కేజీఎఫ్ వంటి సినిమాలతో మనం భాషతో తేడా లేకుండా భారతీయ సినిమాలు చేసే దిశకు మరింత దగ్గరవుతున్నాము. భవిష్యత్తులో 50 భారతీయ చిత్రాలను విడుదల చేయబోతున్నాము. అది చాలా మంచి సంకేతం. మనం ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా మారతాము” అంటూ అల్లు అర్జున్ ‘పుష్ప’తో సహా భారతీయ సినిమా ప్రాముఖ్యత గురించి కూడా ప్రభాస్ మాట్లాడారు.
ఇక తన ఇమేజ్ కు సంబంధం లేకుండా సినిమాలు చేయడం గురించి ప్రభాస్ మాట్లాడుతూ “నేను ప్రయోగాత్మక చిత్రాలను చేయాలని అనుకుంటున్నాను. తెలుగులో నా మొదటి సినిమా యాక్షన్ సినిమా. కానీ నేను మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి రొమాంటిక్ డ్రామాలు కూడా చేశాను. అవి కూడా సూపర్‌హిట్ అయ్యాయి. నేను అన్ని జానర్‌లను ప్రయత్నించాలని అనుకుంటున్నాను. అభిమానులు నా సినిమాలు చూసి విసుగు చెందకూడదు” అని ప్రభాస్ చెప్పాడు. ఇక రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన’రాధేశ్యామ్’ చిత్రాన్ని T సిరీస్‌తో కలిసి UV క్రియేషన్స్ నిర్మించింది. అమితాబ్ బచ్చన్, కృష్ణం రాజు కీలక పాత్రలో కనిపించనున్నారు.
