Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారం నుంచి ప్రభాస్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనివలన ఆయన షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయని, ప్రస్తుతం డార్లింగ్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నట్లు ఫిల్మ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతేడాది నుంచి ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకదాని తరువాత మరొకటి గ్యాప్ లేకుండా షూటింగ్ చేయడం వలన ఆయన ఆనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్.. ప్రాజెక్ట్ కె, సలార్, రాజా డీలక్స్ సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు లేట్ అయినా పర్లేదు అన్నా.. నీ ఆరోగ్యం ముఖ్యం.. ఒక సినిమా తరువాత ఇంకొకటి చెయ్ అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ప్రభాస్ త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.
ఇక నిన్నటికి నిన్న ప్రభాస్ త్వరలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నాడంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు .. ప్రభాస్, కృతిసనన్ మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ట్వీట్ చేశాడు. ఇక్కడ చూస్తే ప్రభాస్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. దీనిబట్టి రీచ్ కోసం ఆ ట్వీట్ వేశాడే తప్ప ఈ పెళ్లి వార్తలో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఏదిఏమైనా ప్రభాస్ ఆరోగ్యంతో బయట కనిపిస్తే చాలని అభిమానులు కోరుకుంటున్నారు.