ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందాల్సిన ‘స్పిరిట్’ సినిమా గురించి చాలా అంచనాలు ఉన్నాయి. నిజానికి, ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రభాస్ అభిమానులతో పాటు సినీ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే, ఇటీవల ‘కింగ్డమ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా, ఈ సినిమాను సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిపారు. కానీ, తాజా సమాచారం మేరకు అది సాధ్యపడకపోవచ్చని తెలుస్తోంది.
Also Read:Wife Kills Husband: కూతురుతో కలిసి భర్తను చంపిన భార్య.. సహాయం చేసిన మరో ఇద్దరు..
ప్రభాస్ ప్రస్తుత కమిట్మెంట్స్ నేపథ్యంలో, సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ జరగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. అందుకే, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ డిసెంబర్ లేదా జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Also Read:Rishab Shetty: ప్రభాస్ హీరోగా రిషబ్ శెట్టి సినిమా?
అంతేగాక, సినిమా షూటింగ్ పూర్తిచేసి, ప్రమోషన్లతో కలిపి 2027లో విడుదల చేయాలన్న ప్లాన్ ఉంది. ముఖ్యంగా సంక్రాంతి రిలీజ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, ఇది ప్రస్తుత పరిస్థితుల ప్రకారం రూపొందించిన ప్రాథమిక షెడ్యూల్ మాత్రమే. ప్రభాస్ డేట్స్ కేటాయింపు ప్రకారం షెడ్యూల్‌లో మార్పులు రావచ్చని చెబుతున్నారు.
