Site icon NTV Telugu

Prabhas Spirit : ‘స్పిరిట్’లో ప్రభాస్ రోల్ ఇదేనా?..మాములుగా లేదుగా..

Prabhas 25

Prabhas 25

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.. గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఇప్పుడు నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు.. అందులో స్పిరిట్ కూడా ఒకటి.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. స్పిరిట్ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ – సందీప్ వంగ సంయుక్త నిర్మాణంలోతెరకెక్కనుంది.

గత ఏడాది యానిమల్ సినిమాతో భారీ హిట్ కొట్టిన సందీప్ వంగ నెక్స్ట్ తీయబోయేది స్పిరిట్ సినిమా అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనుల్లో ఉందని తెలిపారు.. తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.. బాలీవుడ్ లో దుకాణ్ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన సందీప్ వంగని అక్కడి మీడియా ప్రతినిధులు నెక్స్ట్ సినిమా గురించి చెప్పుమనగా.. ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయబోతున్నానని చెప్పాడు..

ఈ సినిమాలో ప్రభాస్ అదిరిపోయే లుక్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలిపారు. దీంతో సందీప్ వంగ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రభాస్ సిన్సియర్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటి నుంచే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..

Exit mobile version