చాలా రోజులుగా డస్కీ సైరన్ పూజా హెగ్డే, ప్రభాస్ కు మధ్య విబేధాలు నెలకొన్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ మాట్లాడుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇంతకుముందు ప్రమోషన్లలో ప్రభాస్, పూజా కలిసి కనిపించకపోవడం ఈ రూమర్స్ కు బలాన్ని చేకూర్చింది. అయితే మార్చ్ 11న విడుదలకు సిద్ధంగా ఉన్న “రాధేశ్యామ్” ప్రమోషన్ కార్యక్రమాల్లో దూకుడు పెంచారు మేకర్స్.
Read Also : RRR : తారక్ అభిమాని అరాచకం… ఏం చేశాడంటే?
అయితే ఇటీవల ‘రాధేశ్యామ్’ టీం స్టార్ట్ చేసిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి కన్పిస్తున్నారు. అంతేకాకుండా పూజాహెగ్డే ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆయనకు సిగ్గు ఎక్కువని, అందుకే ఆయనతో కలవడానికి టైం పడుతుందని, కానీ ఒకసారి కలిసిపోతే మాత్రం ఆయనంత స్వీట్ పర్సన్ మరొకరు లేరని అన్నారు. ఇక తాజాగా తమిళనాడులో జరిగిన “రాధేశ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్ కీలకమని, ప్రేరణ పాత్రకోసం ఎంతగానో అలోచించి పూజను తీసుకున్నామని, ఇక సినిమాలో ఆమెతో కెమిస్ట్రీ బాగా సెట్ అయ్యిందని చెప్పారు. ఇదంతా చూస్తుంటే వీరిద్దరి మధ్య విభేదాలు అంటూ వస్తున్న రూమర్లకు చెక్ పడినట్లే కన్పిస్తోంది.
