Site icon NTV Telugu

Salaar Trailer: రన్ టైమ్ లాక్… రెండున్నర నిమిషాల గూస్‌ బంప్స్ లోడింగ్

Salaar

Salaar

ప్రజెంట్ ఎలక్షన్స్ హడావిడి జోరుగు నడుస్తున్న సంగతి తెలిసిందే. వన్స్ ఎలక్షన్స్ అయిపోతే… సలార్ రచ్చ షురూ కానుంది. డిసెంబర్‌ 1 నుంచే సలార్ సందడి స్టార్ట్ అవనుంది, ఆ రోజే సలార్ ట్రైలర్ బయటికి రానుంది. ఇప్పటికే… ఆ రోజు రాత్రి 7 గంటల 19 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసి మరీ మేకర్స్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ట్రైలర్ కట్ చేసే పనిలో ఉన్నాడని సమాచారం. ఈ ట్రైలర్‌ మామూలుగా ఉండదని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు డార్లింగ్ ఫ్యాన్స్. గతంలో రిలీజ్ అయిన టీజర్‌లో డైనోసర్ అంటూ… ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ పీక్స్‌కు వెళ్లిపోయింది. అది కూడా… కనీసం ప్రభాస్ ఫేస్ చూపించకుండనే డిజిటల్ రికార్డ్స్ బద్దలు కొట్టాడు ప్రశాంత్ నీల్.

ఒక నిమిషం 46 సెకన్ల నిడివితో వచ్చిన సలార్ టీజర్‌ 24 గంటల్లోనే 83 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది. ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. సలార్ ట్రైలర్ రన్ టైం ఎంత? అనేది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం… సలార్ ట్రైలర్ దాదాపు రెండున్నర నుంచి మూడు నిమిషాల నిడివితో ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఉండే హైలెట్ సీన్స్‌, షాట్స్‌తో హై ఓల్టేజ్ యాక్షన్‌ ప్యాక్డ్ గా… ఫ్రేమ్ టు ఫ్రేమ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట ట్రైలర్‌. ఇక ట్రైలర్ రిలీజ్ నుంచే సలార్ ప్రమోషన్స్ స్పీడప్ చేయనున్నారు. రీసెంట్‌గా విదేశాల నుంచి తిరిగొచ్చిన ప్రభాస్… మోకాలి సర్జరీ తర్వాత మొట్టమొదటిసారిగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పబ్లిక్‌లో కనిపించబోతున్నాడు. అందుకే… సలార్ ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Exit mobile version