Salaar Trailer: రన్ టైమ్ లాక్… రెండున్నర నిమిషాల గూస్ బంప్స్ లోడింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజెంట్ ఎలక్షన్స్ హడావిడి జోరుగు నడుస్తున్న సంగతి తెలిసిందే. వన్స్ ఎలక్షన్స్ అయిపోతే… సలార్ రచ్చ షురూ కానుంది. డిసెంబర్ 1 నుంచే సలార్ సందడి స్టార్ట్ అవనుంది, ఆ రోజే సలార్ ట్రైలర్ బయటికి రానుంది. ఇప్పటికే… ఆ రోజు రాత్రి 7 గంటల 19 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసి మరీ మేకర్స్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ట్రైలర్ కట్ చేసే పనిలో ఉన్నాడని సమాచారం. ఈ ట్రైలర్ మామూలుగా ఉండదని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు డార్లింగ్ ఫ్యాన్స్. గతంలో రిలీజ్ అయిన టీజర్‌లో డైనోసర్ అంటూ… ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ పీక్స్‌కు వెళ్లిపోయింది. అది కూడా… కనీసం ప్రభాస్ ఫేస్ చూపించకుండనే డిజిటల్ రికార్డ్స్ బద్దలు కొట్టాడు ప్రశాంత్ నీల్.
ఒక నిమిషం 46 సెకన్ల నిడివితో వచ్చిన సలార్ టీజర్ 24 గంటల్లోనే 83 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది. ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. సలార్ ట్రైలర్ రన్ టైం ఎంత? అనేది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం… సలార్ ట్రైలర్ దాదాపు రెండున్నర నుంచి మూడు నిమిషాల నిడివితో ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఉండే హైలెట్ సీన్స్, షాట్స్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ గా… ఫ్రేమ్ టు ఫ్రేమ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట ట్రైలర్. ఇక ట్రైలర్ రిలీజ్ నుంచే సలార్ ప్రమోషన్స్ స్పీడప్ చేయనున్నారు. రీసెంట్‌గా విదేశాల నుంచి తిరిగొచ్చిన ప్రభాస్… మోకాలి సర్జరీ తర్వాత మొట్టమొదటిసారిగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పబ్లిక్‌లో కనిపించబోతున్నాడు. అందుకే… సలార్ ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..