Site icon NTV Telugu

Prabhas: సలార్… లెక్కలు సరిచేస్తున్నాడు

Salaar Rights

Salaar Rights

ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా డార్లింగ్ పై వేల కోట్లు కుమ్మరిస్తున్నారు మేకర్స్. రీసెంట్‌గా వచ్చిన ఆదిపురుష్‌ సినిమా మిక్స్డ్‌ టాక్‌తో 450 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది అంటే ఇక హిట్ టాక్ పడితే బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఏ రేంజులో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల్లా కాదు నెక్స్ట్ రాబోయే బొమ్మ బ్లాక్ బస్టర్ అని ముందే ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్. సెప్టెంబర్ 28న సలార్ సినిమాతో మాస్ హిస్టీరియా క్రియేట్ చేసేందుకు వస్తున్నాడు డార్లింగ్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ ప్రాజెక్ట్.. రీసెంట్‌గా వచ్చిన టీజర్‌తో అంచనాలను మరింతగా పెంచేసింది. 48 గంటల్లోనే 100 మిలియన్స్ వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం సలార్ బిజినెస్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం 200 కోట్లు కోట్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు… సలార్ థియేట్రికల్ రైట్స్ రేసులో ఉన్నట్టు టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా సలార్ డిజిటల్ బిజినెస్ క్లోజ్ అయినట్టు సమాచారం.

సలార్ డిజిటల్ హక్కుల కోసం ఓటిటి సంస్థల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. నెట్ ఫ్లిక్స్, అమేజాన్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి. ఫైనల్‌గా స‌లార్ ఓటీటీ రైట్స్‌ను ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న‌ట్లు సమాచారం. ద‌క్షిణాదితో పాటు హిందీ భాష‌ల‌కు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను దాదాపు 200 కోట్ల‌కు అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఓటీటీ రైట్స్ ద్వారానే సినిమా కోసం పెట్టిన ఖర్చులో 80 నుంచి 90 శాతం వ‌ర‌కు రిక‌వ‌రీ అయిందని అంటున్నారు. ఇక థియేట్రిక‌ల్, శాటిలైట్ రైట్స్ ద్వారా నిర్మాత‌ల‌కు వ‌చ్చేదంతా లాభాలేన‌ని టాక్. ఇదే కాదు.. బాహుబలి తర్వాత వచ్చిన నష్టాలను కూడా సలార్‌తో సరిచేయబోతున్నాడు డార్లింగ్. మరి బిజినెస్‌తో అంచనాలు పెంచేస్తున్న సలార్.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version