Prabhas: రాముడితో రాక్షసుడు వస్తున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాముడితో పాటే రాక్షసుడు కూడా థియేటర్లోకి వస్తున్నాడని సోషల్ మీడియాలో ట్రెండ్ ఇండియా వైడ్ హల్చల్ చేస్తోంది. రాముడు-రాక్షసుడు కలిసి వస్తున్నారు బాక్సాఫీస్ రికార్డ్స్ తో పాటు ఆన్ లైన్ రికార్డ్స్ కూడా ఉంటే రాసిపెట్టుకోండి అంటున్నారు ప్రభాస్ ఫాన్స్. అసలు సడన్ గా ప్రభాస్ ఫాన్స్ ఈ ట్రెండ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారు అనేది చూస్తే అసలు విషయం అర్ధమవుతుంది. జూన్ 16న ఆదిపురుష్ మూవీ చాలా గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకి రాబోతోంది. రామాయాణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత కమర్షియల్ సినిమాల్లో ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ చేసేందుకు వస్తోంది సలార్ మూవీ. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడు.
అందులో ఒకటి రాక్షసుడికి మించిన భయంకరమైన నెగటివ్ రోల్ అని తెలుస్తోంది. ఇప్పటి వరకు సలార్ నుంచి జస్ట్ కొన్ని లుక్స్ మాత్రమే రిలీజ్ చేశారు, అవన్నీ ప్రభాస్ యంగ్ లుక్ లో ఉన్నవే కానీ సలార్ అనౌన్స్మెంట్ సమయంలో వదిలిన పోస్టర్ లో ప్రభాస్ కొంచెం ఏజ్డ్ లుక్ లో కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్ కి సంబంధించిన ఎలాంటి లీక్ బయటకి రాలేదు. ఆ క్యారెక్టర్ నే మోస్ట్ వయొలెంట్ క్యారెక్టర్ గా ప్రశాంత్ నీల్ తీర్చిదిద్దాడు. ఆదిపురుష్ రిలీజ్ కోసం ఇన్ని రోజులు సలార్ ని హోల్డ్ చేసారు. ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు వయొలెంట్ గా మారే సమయం వచ్చింది. జూన్ 16న రాముడితో పాటే రాక్షసుడు కూడా రాబోతున్నాడట. ఆదిపురుష్‌తో పాటే థియేటర్లో సలార్ టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆదిపురుష్ రిలీజ్ అవుతున్న అన్ని థియేటర్స్‌లో సలార్ టీజర్ స్క్రీనింగ్ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. మరి ఇది నిజమో కాదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.
Also Read
తాజావార్తలు
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!