NTV Telugu Site icon

Prabhas: రాముడితో రాక్షసుడు వస్తున్నాడు!

Prabhas

Prabhas

రాముడితో పాటే రాక్షసుడు కూడా థియేటర్లోకి వస్తున్నాడని సోషల్ మీడియాలో ట్రెండ్ ఇండియా వైడ్ హల్చల్ చేస్తోంది. రాముడు-రాక్షసుడు కలిసి వస్తున్నారు బాక్సాఫీస్ రికార్డ్స్ తో పాటు ఆన్ లైన్ రికార్డ్స్ కూడా ఉంటే రాసిపెట్టుకోండి అంటున్నారు ప్రభాస్ ఫాన్స్. అసలు సడన్ గా ప్రభాస్ ఫాన్స్ ఈ ట్రెండ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారు అనేది చూస్తే అసలు విషయం అర్ధమవుతుంది. జూన్ 16న ఆదిపురుష్ మూవీ చాలా గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకి రాబోతోంది. రామాయాణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత కమర్షియల్ సినిమాల్లో ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ చేసేందుకు వస్తోంది సలార్ మూవీ. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ ‘సలార్’ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడు.

అందులో ఒకటి రాక్షసుడికి మించిన భయంకరమైన నెగటివ్ రోల్ అని తెలుస్తోంది. ఇప్పటి వరకు సలార్ నుంచి జస్ట్ కొన్ని లుక్స్ మాత్రమే రిలీజ్ చేశారు, అవన్నీ ప్రభాస్ యంగ్ లుక్ లో ఉన్నవే కానీ సలార్ అనౌన్స్మెంట్ సమయంలో వదిలిన పోస్టర్ లో ప్రభాస్ కొంచెం ఏజ్డ్ లుక్ లో కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్ కి సంబంధించిన ఎలాంటి లీక్ బయటకి రాలేదు. ఆ క్యారెక్టర్ నే మోస్ట్ వయొలెంట్ క్యారెక్టర్ గా ప్రశాంత్ నీల్ తీర్చిదిద్దాడు. ఆదిపురుష్ రిలీజ్ కోసం ఇన్ని రోజులు సలార్ ని హోల్డ్ చేసారు. ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు వయొలెంట్ గా మారే సమయం వచ్చింది. జూన్ 16న రాముడితో పాటే రాక్షసుడు కూడా రాబోతున్నాడట. ఆదిపురుష్‌తో పాటే థియేటర్లో సలార్ టీజర్‌ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆదిపురుష్ రిలీజ్ అవుతున్న అన్ని థియేట‌ర్స్‌లో స‌లార్ టీజ‌ర్ స్క్రీనింగ్ ఉంటుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ టీజ‌ర్ రిలీజ్ డేట్‌ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. మరి ఇది నిజమో కాదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.

Show comments