Salaar: డైనోసర్ ఫైనల్ టచ్ ఇస్తున్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడితే చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అవడంతో… రిలీజ్‌కు రెడీగా ఉన్న సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి రేంజ్ హిట్ ఇచ్చేది కేవలం ‘సలార్’ మాత్రమేనని గట్టిగా నమ్ముతున్నారు డార్లింగ్ అభిమానులు. ప్రశాంత్ నీల్ ‘కెజియఫ్ చాప్టర్ 2’ చూసిన తర్వాత… సలార్ పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కు వెళ్లిపోయాయి. అందుకు తగ్గట్టే రీసెంట్‌గా వచ్చిన సలార్ ట్రైలర్ డిజిటల్ రికార్డ్స్ అన్ని బద్దలుకొట్టింది. సినిమా రిలీజ్‌కు వారం రోజుల ముందు సలార్ నుంచి మరో పవర్ ఫుల్ యాక్షన్ ట్రైలర్ బయటికి రానునట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రమోషన్స్ కూడా చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రశాంత్ నీల్. అయితే సినిమా రిలీజ్‌కు రెండు వారాలు మాత్రమే ఉంది కాబట్టి.. ప్రశాంత్ నీల్ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి చేసి ఉంటాడు.
ఏదైనా పెండింగ్ వర్క్ ఉంటే… అన్నీ కూడా కంప్లీట్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. ప్రస్తుతం ప్రభాస్ ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ తన డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడట డార్లింగ్. తను డబ్బింగ్ చెప్పనున్న అన్ని వెర్షన్‌ల డబ్బింగ్‌లని హైదరాబాద్‌లోనే కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో… సలార్‌కు ఇదే ఫైనల్ టచ్ అని చెప్పొచ్చు. ఇక డిసెంబర్ 22న భారీ ఎత్తున థియేటర్లోకి రానున్న సలార్ సినిమాను కేజీఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్‌గా, పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తుండగా… రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. మరి భారీ అంచనాలున్న సలార్… బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
- Sharanya: 'లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి' ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!