NTV Telugu Site icon

NTR 31: నీల్-ఎన్టీఆర్ సినిమాకి బ్రేక్ వేస్తున్న సలార్?

Ntr 31

Ntr 31

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ లేదా నవంబర్ వరకు ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దేవర షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్ హిందీలో వార్ 2 చేయనున్నాడు. హ్రితిక్ vs ఎన్టీఆర్ అనే రేంజులో ప్రమోట్ అవుతున్న ఈ మూవీ కంప్లీట్ చేయగానే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చేయడానికి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ, అనౌన్స్మెంట్ తోనే హ్యూజ్ హైప్ ని క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రమే కాకుండా సినీ అభిమానులంతా ఈ ఊర మాస్ కాంబినేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ మరింత పెరుగుతుందేమో అనే భయాన్ని మొదలయ్యేలా చేసాడు సలార్.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీతో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ అవగానే వెంటనే ఎన్టీఆర్ 31 పై ఫోకస్ చేయాల్సి ఉంది ప్రశాంత్ నీల్ కానీ ‘సలార్’ రెండు భాగాలుగా ప్రకటించడంతో… ఎన్టీఆర్‌ 31 ప్రాజెక్ట్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని టాక్ మొదలయ్యింది. అయితే ఎన్టీఆర్ 31 డిలే అవుతుందనే ఆలోచన అవసరం లేదు ఎందుకంటే సలార్ పార్ట్ 1 రిలీజ్ అయిన వెంటనే ‘సలార్ పార్ట్ 2’కు ప్రశాంత్ నీల్ రంగం సిద్ధం చేస్తున్నాడట. ఆల్రెడీ రెండు పార్ట్స్ ని కలిపే షూట్ చేస్తున్నాడు, చిన్న చిన్న కరెక్షన్స్ లేదా ప్యాచ్ వర్క్స్ ఉంటే వాటిని కూడా త్వరగానే పూర్తి చేయడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నాడని టాక్. దీంతో అనుకున్న సమయానికే ఎన్టీఆర్ 31 సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పొచ్చు.

Show comments