ఇండియన్ బాక్సాఫీస్ ఇప్పటివరకు ఎన్నో క్లాష్ లు చూసి ఉండొచ్చు కానీ ఈ డిసెంబర్ 22న ప్రభాస్-షారుఖ్ మధ్య ఎపిక్ వార్ జరగబోతుంది. ఫామ్ లో ఉన్న షారుఖ్… ప్రశాంత్ నీల్ తో కలిసిన ప్రభాస్ ల మధ్య జరగనున్న ఈ బాక్సాఫీస్ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ వర్గాలు మాత్రం… ప్రభాస్-షారుఖ్ మధ్య క్లాష్ రాకూడదు అనుకుంటున్నారు కానీ అటు ప్రభాస్, ఇటు షారుఖ్ వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. ఈ ఎల్ క్లాసికో ఫైట్ జరగడం గ్యారెంటీ అనే విషయం తెలియగానే… నార్త్ సౌత్ సినీ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వెర్బల్ వార్ జరుగుతోంది. షారుఖ్ ఫ్యాన్స్ సలార్ సినిమాని టార్గెట్ చేస్తే… ప్రభాస్ ఫ్యాన్స్ డుంకి సినిమాని డాంకీ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. ఇప్పుడు నార్త్ మూవీ లవర్స్ అండ్ షారుఖ్ ఫ్యాన్స్ సలార్ సినిమాని ఉగ్రం మూవీ రీమేక్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఉగ్రం అనేది నా మొదటి సినిమా, నేను ఇకపై ఎన్ని సినిమాలు చేసినా కూడా నా మొదటి సినిమా తాలూకు ఇంపాక్ట్ అన్ని సినిమాల్లో ఉంటుందని ప్రశాంత్ నీల్ చెప్పాడు.
సలార్ సినిమాలో కూడా ఉగ్రం ఛాయలు ఉంటాయి. అయినా కన్నడ సినిమాని రీమేక్ చేసి కన్నడలో రిలీజ్ చేయడానికి అన్ని వందల కోట్లని ప్రశాంత్ నీల్ ఖర్చు పెడతాడా? దానికి అసలు ప్రొడ్యూసర్స్ ఓకే చెప్తారా అనేది కూడా ఆలోచించకుండా షారుఖ్ ఫ్యాన్స్ సలార్ సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. డుంకి సినిమాకి నార్త్ లో మంచి కలెక్షన్స్ వస్తాయేమో కానీ ఇలా సలార్ ని టార్గెట్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ ని గెలికితే మాత్రం సౌత్ లో డుంకి సినిమా ఢమాల్ అనడం గ్యారెంటీ. రెండు భారీ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వకూడదు కానీ అవుతున్నాయి. ఎవరి సినిమా బాగుంటే ఫ్యాన్స్ ఆ సినిమాని చూస్తారు, రెండు సినిమాలకి రెండు వర్గాల ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఓపెనింగ్స్ లో తేడా ఉన్నా లాంగ్ రన్ లో ఏ మూవీ మార్కెట్ ఆ మూవీకి ఉంటుంది. ఇంతదానికి హీరో ఫ్యాన్స్ ని ఇంకో హీరో ఫ్యాన్స్ రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు.
