ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వస్తోంది. థియేటర్ల దగ్గర జరగబోయే మాస్ జాతర ఎలా ఉంటుందో చూపించేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ‘సలార్’ రిలీజ్ అవడానికి ఇంకా నెల రోజులకు పైగానే సమయం ఉంది. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కానుంది కానీ అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అయితే ఆ బుకింగ్స్ పూర్తి స్థాయిలో కాదు… పైగా ఇండియాలో కూడా కాదు. అమెరికాలో ఆగస్టు 25 నుంచి ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చెప్పినా… కాస్త ముందుగానే సోమవారం నుంచి బుకింగ్స్ స్టార్ట్ చేశారు. పూర్తిస్థాయిలో కాకుండా కొన్నిచోట్ల మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక బుకింగ్స్ ఓపెన్ అయిన గంటల్లోనే సలార్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సలార్ ప్రీ సేల్స్ ఇప్పటికే లక్ష యాభై వేల డాలర్ మార్క్‌ను టచ్ చేసినట్టు తెలుస్తోంది.
నెల రోజుల ముందే ఈ రేంజ్ బుకింగ్స్ అంటే ఈ లెక్కన ‘సలార్’ ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. తుఫాన్‌కు ముందు వాతావరణ శాఖ హెచ్చరిక జారి చేసినట్టుగా… ఈ బుకింగ్స్‌ను జస్ట్ శాంపిల్‌గా చెప్పొచ్చు. ఇప్పటికే అక్కడ భారీ ఎత్తున సలార్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అక్కడున్న అన్ని ఏరియాల్లో కనీవినీ ఎరుగుని రీతిలో సలార్ రిలీజ్ కానుంది. దీంతో ఓవర్సీస్‌లో సలార్ రికార్డుల వేట షురూ అయిందని చెప్పొచ్చు. ఇకపోతే… ఇప్పటి వరకు సలార్ నుంచి కేవలం ఒక్క టీజర్ మాత్రమే బయటికొచ్చింది. అది కూడా ప్రభాస్ ఫేస్ కనిపించకుండానే రిలీజ్ చేశారు. అందుకే.. ఈ నెలాఖరులో పవర్ ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఒక్కసారి సలార్ ట్రైలర్ బయటికొస్తే చాలు.. సోషల్ మీడియా తగలబడిపోవడం గ్యారెంటీ.
