ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో కలిసి చేసిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. అన్ని సెంటర్స్ లో అర్ధరాత్రి నుంచే షోస్ పడిపోవడంతో తెల్లారే సరికి సలార్ టాక్ బయటకి వచ్చేసింది. హిట్ టాక్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతోంది సలార్ మౌత్ టాక్. ప్రభాస్ నుంచి వచ్చే మాములు సినిమానే ఓపెనింగ్స్ లో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది, అలాంటిది ప్రశాంత్ నీల్ తో చేసిన సినిమా అంటే బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా సలార్ హవా పీక్స్ లో ఉంది. ప్రీసేల్స్ లో కొత్త రికార్డుని సెట్ చేస్తున్న ప్రభాస్… ప్రీమియర్స్ తో గత ఆరేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డుని బ్రేక్ చేసాడు. యుఎస్ మార్కెట్ లో అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్స్ నుంచి 1.52 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది.
పవన్ కళ్యాణ్ 25వ సినిమా అవ్వడం, త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో అజ్ఞాతవాసి సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. ఈ అంచనాలని అందుకోవడంలో అజ్ఞాతవాసి సినిమా ఫెయిల్ అయ్యింది కానీ ఓపెనింగ్స్ మాత్రం అన్ని సెంటర్స్ లో సెన్సేషనల్ గా వచ్చాయి. యుఎస్ ప్రీమియర్స్ విషయంలో అజ్ఞాతవాసి సెట్ చేసిన బెంచ్ మార్క్ ని బ్రేక్ చేయడానికి చాలా సినిమాలు ట్రై చేసాయి కానీ వర్కౌట్ అవ్వలేదు. ఈసారి మాత్రం ప్రభాస్ ఆ రికార్డుని అసలు మిస్ చేయలేదు. ఓవర్సీస్ మార్కెట్ లో యుఎస్ రీజన్ లో ప్రీమియర్స్ తోనే ప్రభాస్ 2 మిలియన్ మార్క్ ని టచ్ చేసాడు. టాక్ బాగుంది కాబట్టి వీకెండ్ అయ్యే లోపు ప్రభాస్ సలార్ సినిమాతో ఓవర్సీస్ మార్కెట్ లో ఎంతవరకు కలెక్ట్ చేస్తాడు అనేది చూడాలి.