NTV Telugu Site icon

Prabhas: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్.. ప్రభాస్ రియాక్షన్ చూశారా .. ?

Sweety

Sweety

Prabhas: లేడీ సూపర్ స్టార్ అనుష్క, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. సెప్టెంబర్ 7 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ప్రమోషన్స్ లో భాగంగా నేడు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించింది. పెళ్లి అంటే ఇష్టం లేని ఒక అమ్మాయిని ప్రేమించిన ఒక అబ్బాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు. పెళ్లి వద్దు.. పిల్లలు మాత్రమే కావాలన్న హీరోయిన్ తో హీరో ఎలా కష్టపడ్డాడు అనేది ఎంతో వినోదాత్మకంగా చూపించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ పై ప్రభాస్ స్పందించాడు. ప్రభాస్, అనుష్క ఎంత మంచి స్నేహితులో అందరికి తెల్సిందే. అందులోను ఈ సినిమాను నిర్మించింది ప్రభాస్ అన్న ప్రమోద్ కావడంతో సినిమా ట్రైలర్ ను ప్రభాస్ వెంటనే చూసినట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ ట్రైలర్ పై ఇచ్చిన రివ్యూను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Gandeevadhari Arjuna: పవర్ ఫుల్ యాక్షన్ తో అదరగొట్టిన వరుణ్ తేజ్

“మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ చూసినంత సేపు నేను నవ్వును ఆపుకోలేకపోయాను. స్వీటీ అండ్ నవీన్ మీరిద్దరూ అద్భుతంగా చేశారు. సెప్టెంబర్ 7 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్” అని చెప్పుకొచ్చాడు. ఇక దీనికి యూవీ స్పందిస్తూ థాంక్యూ ప్రభాస్ గారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో అనుష్క ఎలాంటి హిట్ యూ అందుకుంటుందో చూడాలి.

Show comments