NTV Telugu Site icon

Prabhas: ఈసారి ‘రాజా సాబ్’ లేకుండానే లాగిస్తున్నారు…

The Raja Saab

The Raja Saab

సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న కల్కికి.. త్వరలోనే ప్యాకప్ చెప్పేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక సలార్ తర్వాత ఆరు నెలల గ్యాప్‌లో కల్కిగా వస్తున్న ప్రభాస్… మరో ఆరు నెలల గ్యాప్‌లో రాజా సాబ్‌గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. స్టార్టింగ్ నుంచి సైలెంట్‌గా షూటింగ్ జరుపుకున్న మారుతి సినిమాను పోయిన సంక్రాంతికి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. రాజా సాబ్ టైటిల్‌తో వింటేజ్ డార్లింగ్‌ను చూపించి కిక్ ఇచ్చాడు మారుతి. ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రాజా సాబ్… త్వరలో మరో కొత్త షెడ్యూల్‌కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఈ నెల మూడో వారం తరువాత ఓ షెడ్యూలు ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే ప్రభాస్ లేని సీన్లు షూట్ చేయనునట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కికి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. మరో వెర్షన్ ప్రకారం… యూరప్ ట్రిప్‌లో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల మాట. అందుకే… రాజా సాబ్ నెక్స్ట్ షెడ్యూల్‌లో ప్రభాస్ లేకుండానే షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడట మారుతి. వీలైనంత తర్వాత రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్ చేసి ఈ ఏడాది చివర్లో లేదా… వచ్చే సంక్రాంతి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరి నిర్మిస్తున్న ఈ సినిమాలో… మాళవిక మోహన్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.