బాహుబలి సినిమా ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తే ‘ప్రాజెక్ట్ K’ సినిమాతో ప్రభాస్ ని పాన్ వరల్డ్ స్టార్ ని చెయ్యాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నాడు. హ్యుజ్ స్కేల్ లో, ఇండియాలోనే భారి బడ్జట్ తో, ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ సినిమాపై ఇండియాలో భారి అంచనాలు ఉన్నాయి. అసలు నాగ్ అశ్విన్ ఎలాంటి సినిమా చేస్తున్నాడు? ప్రాజెక్ట్ K అంటే ఏంటి? కార్స్, బైక్స్, టైర్స్, కొత్త కొత్త మెషిన్స్ ఎందుకు తయారు చేస్తున్నాడు? ప్రతి పోస్టర్ లో చేతులు మాత్రమే ఎందుకు చూపిస్తున్నాడు? అమితాబ్ రోల్ ఏంటి? దీపికా పోస్టర్ లో ఆమె ఎడారిలాంటి ప్రాంతంలో ఒక సూపర్ హీరో సినిమా హీరోయిన్ లా సిల్లహౌట్ లో ఎందుకు ఉంది? ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు? ప్రాజెక్ట్ K కోసం మహింద్రా కంపెనీ ఎందుకు వర్క్ చేస్తుంది? వరల్డ్ క్లాస్ టెక్నిషియన్స్ కలిసి ప్రాజెక్ట్ K ని ఎలా రూపొందిస్తున్నారు… ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికే రోజు ఎప్పుడో తెలిసిపోయింది. ఈ పాన్ వరల్డ్ సినిమాని 2024 జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు వైజయంతి క్రియేషన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
మహాశివరాత్రి పండగ సంధర్భంగా ఎలాంటి ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండా, పెను తుఫాన్ లా బయటకి వచ్చిన ఈ అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో కమ్మేసింది. ప్రాజెక్ట్ K 2024 సంక్రాంతికి వస్తుంది అంటే అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్, హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉంది. ముగ్గురు గన్స్ పట్టుకోని ఒక “హ్యాండ్’ స్టాట్యూ వైపు వెళ్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. భారి మెషిన్స్, వెపన్స్, ఎడారి, మోడరన్ గన్స్… ఇలా ఒక్క పోస్టర్ లోనే నాగ్ అశ్విన్ చాలా క్యురియాసిటి పెంచే విషయాలని ఇంక్లూడ్ చేశాడు. పోస్టర్ లో చూపించిన ఆ ‘చెయ్యి’ ఏంటి? మోడరన్ గన్స్ పట్టుకోని నడుస్తున్న వాళ్లు ఎవరు? అనే విషయాలు తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రాజెక్ట్ K రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు కాబట్టి 2024 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సునామీ రాబోతుందనే విషయం అర్ధమవుతుంది. లాంగ్ వీకెండ్, పండగ సీజన్ లాంటివి కలిసి వస్తున్నాయి కాబట్టి ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ సినిమాతో ఆల్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యడం గ్యారెంటి.
𝟏𝟐-𝟏-𝟐𝟒 𝐢𝐭 𝐢𝐬! #𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭𝐊
Happy Mahashivratri.#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/MtPIjW2cbw
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 18, 2023