Site icon NTV Telugu

Prabhas: ఇదెక్కడి రచ్చ… ఇది భీమవరమా లేక అమెరికానా?

Project K

Project K

ఇప్పటి వరకు కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయకుండా ప్రాజెక్ట్ K ప్రమోషన్స్ చేస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్, జస్ట్ హ్యాండ్ పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలతోనే హైప్ పెంచుతూ వచ్చాడు. ఇక ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అనే రేంజులో ప్రాజెక్ట్ K ప్రమోషన్స్ ని మేకర్స్ మంచి ప్లానింగ్ తో చేస్తున్నారు. అందుకే ప్రాజెక్ట్ కె టైటిల్, ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ కోసం ప్రభాస్ ఫాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్‌గా జూలై 20న అమెరికాలో జరుగనున్నశాన్‌ డియాగో కామిక్ కాన్‌ వేదిక పై ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టుగా అఫీషియల్‌ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంతకంటే ముందే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న దీపిక పదుకొనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

గతంలో దీపిక బర్త్ డే సందర్భంగా.. బ్యాక్ సైడ్‌ నుంచి ఓ లుక్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే లుక్‌ని క్లోజ్‌లో ఫేస్‌ను మాత్రమే రివీల్ చేసినట్టుగా ఉంది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా అమెరికాలోని ప్రభాస్ ఫాన్స్ కార్స్ తో హంగామా చేసారు. యుఎస్ఏలోని సెయింట్ లూయిస్ లో ప్రభాస్ ఫాన్స్ ‘ప్రాజెక్ట్ K’ అనే డిజైన్ వచ్చేలా కార్ ర్యాలీ చేసారు. ఈ ర్యాలీ చూస్తే ఇది భీమవరమా లేక అమెరికా అనే డౌట్ రాకమానదు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకుండా, ప్రభాస్ అసలు ఏ లుక్ లో ఉంటాడో కూడా తెలియకుండానే ఫాన్స్ ఈ రేంజ్ ఉంటే ఒకసారి ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ కూడా బయటకి వచ్చేస్తే అమలాపురం నుంచి అమెరికా వరకూ ప్రభాస్ పేరు, ప్రాజెక్ట్ K పేరు రీసౌండ్ వచ్చేలా వినిపిస్తాయేమో.

Exit mobile version