Site icon NTV Telugu

Salaar: పార్ట్ 1 రిలీజే రెండు సార్లు అంట మావా…

Salaar

Salaar

నిజమే.. సలార్ మూవీ నెల రోజుల గ్యాప్‌లో రెండు సార్లు రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. అన్ని భాషల్లోను అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ముందు నుంచి వ‌ర‌ల్డ్ వైడ్‌ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సలార్ ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను హాలీవుడ్ సినిమాల‌కు ధీటుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే సౌండ్ మేకింగ్‌, డ‌బ్బింగ్ విష‌యంలో స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 28 టార్గెట్‌గా సలార్ ఇంగ్లీష్ వెర్షన్ రెడీ చేస్తున్నట్టు ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ సలార్ కాస్త లేట్‌గా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మామూలుగా ఏ సినిమా తీసుకున్నా సరే… హిట్‌ రేంజును బట్టి ఒక్కో భాషలో ఒక్కో టైంలో రిలీజ్ చేస్తారు.

Read Also: Pan India Stars: పూనకాలే… ఒకేసారి నలుగురు పాన్ ఇండియా మొనగాళ్లు!

ట్రిపుల్ ఆర్, కెజియఫ్ సినిమాలు ఇక్కడ భాక్సాఫీస్‌ను షేక్ చేసిన చాలా రోజులకు జపాన్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అంత గ్యాప్ తీసుకోకుండా కేవలం రెండు వారాల గ్యాప్‌లో సలార్ మూవీ ఇంగ్లీష్ వెర్షన్‌ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అక్టోబ‌ర్ 13న సలార్ రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన తక్కువ గ్యాప్‌లో సలార్ సీజ్ ఫైర్ రెండు సార్లు రిలీజ్ కానుందని చెప్పొచ్చు. ఇంగ్లీష్‌లో సలార్ రిలీజ్ అయితే… ఇండియాలో కూడా ఈ వెర్షన్ అందుబాటులో ఉండనుంది. మరి హై స్కై అంచనాల మధ్య వస్తున్న సలార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version