Site icon NTV Telugu

Prabhas: అభిమాని మృతి.. పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్

prabhas

Prabhas, పూజ హెగ్డే జంటగా నటించిన “రాధేశ్యామ్” సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఏకకాలంలో హిందీలో కూడా విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంటోంది. ఈ సినిమా మా స్పందన ఎలా ఉన్నా సరే కలెక్షన్ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మంచి కలెక్షన్లతో సినిమా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్ థియేటర్ వద్ద ఒక బ్యానర్ కడుతూ చల్ల కోటేశ్వరరావు అనే అభిమాని ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలిసిందే. అతని మరణం గురించి తెలుసుకున్న ప్రభాస్ వెంటనే రెండు లక్షల రూపాయలు ఆయన భార్య పిచ్చమ్మ అకౌంట్లో జమ అయ్యేలా చేశారు.

Read Also : Bigg Boss Non Stop : నామినేషన్లలో 12 మంది… పక్కపక్కనే ఉంటూ గోతులు…

చల్లా కోటేశ్వరరావు అనే అభిమాని నిరుపేద వ్యక్తి అని ప్రభాస్ అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభాస్ దృష్టికి తీసుకు వెళ్ళడంతో… వెంటనే స్పందించిన ప్రభాస్ అతని కుటుంబానికి సాయం ప్రకటించారు. భవిష్యత్తులో కూడా అతని కుటుంబానికి అండగా ఉంటామని ప్రభాస్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి దైర్యం చెప్పినట్లు సమాచారం. ప్రభాస్ పెద్ద మనసు చాటుకున్న విధానానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Exit mobile version