యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మార్కెట్ ను కూడా పెంచుకున్నాడు తేజ. తాజాగా తేజ నటించిన మిరాయ్ పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్ గా ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఫస్ట్ డే నుండి సూపర్ హిట్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది మిరాయ్.
Also Read : OGTrailer : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాక్.. ‘OG’ ట్రైలర్ రిలీజ్ పోస్ట్ పొన్
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను మిరాయ్ అదరగొట్టింది. ఏకంగా 2.5 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ వసూళ్లతో అరుదైన రికార్డ్ క్రియేట్ ను తన పేరిట నమోదు చేసుకున్నాడు తేజ. గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్, కల్కి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 2.5 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసాయి. అలాగే యంగ్ టైగర్ నటించిన RRR, దేవర సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 2.5 మిలియాన్స్ రాబట్టాయి. ఇప్పుడు ఆ ఇద్దరి హీరోల తర్వాత యంగ్ హీరో తేజ వారిద్దరి సరసన నిలబడ్డాడు. సజ్జా నటించిన హనుమాన్ ఓవర్సీస్ లో 2.5 మిలియన్స్ కు పైగా రాబట్టగా తాజాగా విడుదలైన మిరాయ్ కూడా ఆ నుంబర్ ను అనుకుంది. ఇలా వరుసగా రెండు సినిమాలతో మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి ఓవర్సీస్ లో తన మార్కెట్ ను మరింత పుచుకున్నాడు తేజ సజ్జా. వందల కోట్ల బుడ్జెట్స్, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్స్ కంటే కంటెంట్ ముఖ్యమని తేజ సజ్జా తన సినిమాతో నిరూపించి స్టార్ హీరోల రేంజ్ వసూళ్లు రాబడుతున్నాడు.
