ఈ జనరేషన్ ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్… స్టైలిష్ సినిమా చేస్తే హాలివుడ్ హీరోలా కనిపిస్తాడు, వార్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తే ఒక రాజులా కనిపిస్తాడు. లుక్ పరంగా ప్రభాస్ ఏ సినిమా చేసినా అందులో ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ అంత బాగుండే ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం లుక్ విషయంలో పెద్దగా కేర్ తీసుకోడు అనేది నిజం. హెడ్ స్కార్ఫ్ పెట్టుకోని, డిఫరెంట్ స్టైల్ లో ఉండే అవుట్ ఫిట్స్ వేసుకోని బయటకి వస్తుంటాడు ప్రభాస్. స్టైల్ గా ఉండే హెయిర్ ని ప్రభాస్ ఎందుకు కవర్ చేస్తాడో తెలియదు కానీ ప్రభాస్ ని ఆ హెడ్ స్కార్ఫ్ తో చూడగానే ఫాన్స్ అంతా ‘ఎవడ్రా ఆ హెడ్ స్కార్ఫ్ ప్రభాస్ అన్నకి ఇచ్చింది?’ అంటూ డిజప్పాయింట్ అవుతారు. అది లేకుండా ప్రభాస్ ని ఆఫ్ స్క్రీన్ లో చూడడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.
ఇలాంటి అరుదైన సంఘటనే అన్ స్టాపపబుల్ స్టేజ్ పై జరిగింది. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపపబుల్ టాక్ షో సీజన్ 2కి ప్రభాస్ గెస్ట్ గా వచ్చాడు. జనవరి 1న టెలికాస్ట్ అవ్వనున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ ఇటివలే జరిగింది. ఈ ఎపిసోడ్ షూటింగ్ స్పాట్ నుంచి ప్రభాస్ ఫొటోస్ కొన్ని బయటకి వచ్చి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. #UnstoppablewithPrabhas అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి రెబల్ స్టార్ ఫాన్స్ ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నారు. దీనికి కారణం ప్రభాస్ హెడ్ స్కార్ఫ్ లేకుండా, స్టైలిష్ హెయిర్ స్టైల్ తో కనిపించడమే. ఎల్లో, లైట్ గ్రీన్ చెక్స్ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకున్న ప్రభాస్ సింపుల్ అండ్ స్టైలిష్ గా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ ని ఇలాంటి లుక్ లో కనిపించలేదు. అందుకే ప్రభాస్ ఫాన్స్ అంత సంతోషంగా ఉన్నారు. ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్ కి ప్రభాస్ తో పాటు హీరో గోపీచంద్ కూడా గెస్ట్ గా వచ్చాడు. గోపీచంద్, ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరితో కలిసి బాలయ్య న్యూ ఇయర్ కి సందడి చేయనున్నాడు.
