Prabhas – Maruthi Film Title: హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి పాన్ ఇండియా కటౌట్ అనిపించుకున్న ఎందుకో కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో హిట్స్ ఇవ్వలేదు. అయితే ఇప్పటివరకు ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సీనియాలే చేస్తుండగా ఆయన హీరోగా, మారుతీ దర్శకుడిగా, మాళవిక మోహనన్ హీరోయిన్ గా ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెట్స్ నుంచి ఆ మధ్య ప్రభాస్ ఫొటోస్ కొన్ని లీక్ అయి సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మారుతి సినిమా విషయంలో ఎందుకో ముందు నుంచి పాజిటివ్ గా ఉన్నట్లు కనిపించట్లేదు. ప్రభాస్-మారుతి సినిమా ఓపెనింగ్ జరుగుతుంది అనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచే, ఈ సినిమా చెయ్యొద్దు అన్నా అంటూ రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో షేక్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్.
Deepti sati: ”సిన్” భామ సెగలు రేపుతోంది.. నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్
మారుతి, ప్రభాస్ తో కలిసి కామెడీ సినిమా చేస్తున్నాడు అని అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ టెన్షన్ పడ్డారు. అయితే ఆ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిజస్టర్ చేయడం కూడా వారి టెన్షన్ కు కారణమైంది. ప్రభాస్ మారుతి సినిమా టైటిల్ రాజా డీలక్స్ అని ఒక్కసారిగా వైరల్ అయింది. అయితే ఈ టైటిల్ పై చాలా మంది అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే వారి టెన్షన్ క్లియర్ చేసేలా ఒక కొత్త టైటిల్ ను రిజిస్టర్ చేశారని అంటున్నారు. తాజాగా ఫిలిం నగర్ వర్గాల సమాచారం మేరకు అంబాసిడర్ అనే కొత్త టైటిల్ రిజిస్టర్ చేయబడింది. ఈ సినిమాలో అంబాసిడర్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అందుకే ఈ చిత్రానికి మారుతి “అంబాసిడర్ ” అనే టైటిల్‌ను ఫిక్స్ చేయబోతున్నారు అని అంటున్నారు.