Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు లక్కీ హ్యాండ్ అయిపోయాడు. ఏ సినిమాకు హెల్ప్ చేసినా సరే అది బ్లాక్ బస్టర్ అవుతోంది. మొన్నటికి మొన్న కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. కొన్నేళ్లుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న విష్ణుకు మంచి హిట్ పడింది. దెబ్బకు ప్రభాస్ పేరు మార్మోగిపోయింది. దాని తర్వాత మొన్న తేజ సజ్జ నటించిన మిరాయ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇంకేముంది ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము లేపింది ఆ సినిమా.
Read Also : Kalyani Priyadarshan : బాబోయ్.. కల్యాణి ప్రియదర్శిన్ ఫోజులు చూస్తే అంతే
ఇక ఇప్పుడు కాంతార చాప్టర్ 1కు సాయం అందించాడు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి హిట్ కొట్టింది. ఇలా ప్రభాస్ సాయం చేసిన సినిమాలు అన్నీ మంచి హిట్ అవుతున్నాయి. అందుకే ప్రభాస్ సాయం కావాలన్నట్టు నిర్మాతలు ప్రయత్నాలు జరుపుతున్నారంట. ప్రభాస్ కు పాన్ ఇండియా రేంజ్ లో భారీ మార్కెట్ ఉంది. పైగా ఆయన సాయం చేస్తే హిట్ అనే సెంటిమెంట్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కు డిమాండ్ పెరిగిందంటున్నారు. ప్రభాస్ నా పరా అనే చూడకుండా ఎవరికైనా సాయం చేస్తాడనే విషయం తెలిసిందే.
